వినుకొండలో జులై 2న నిరసన సభ

వినుకొండ, జూన్‌ 28 : లక్ష్మీపేట దళితులపై అగ్రకులాల వారి దాడులకు నిరసనగా జులై 2వ తేదీ సాయంత్రం పట్టణంలో నిరసన సభలు నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు వెంకటరావు, ఆల్‌ప్రెడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎపిసిఎస్‌సి రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. అదేవిధంగా న్యాయవాదులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.