వివిధ ప్రాంతాల్లో 450 మంది శ్రీలంక సైనికులకు శిక్షణ

న్యూఢిల్లీ: తమిళనాడు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శ్రీలంక సైనిక దళాలకు చెందిన సిబ్బంది సైనిక శిక్షణ పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. పొరుగు దేశాలతో సంబంధాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 450 మంది శ్రీలంక సైనిక సిబ్బంది శిక్షణ పొందుతున్నారు.