విశాఖకు చేరుకున్న భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు

విశాఖపట్నం: విశాఖలో శనివారం జరగనున్న టీ-20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు విశాఖకు  చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆటగాళ్లు బెంగుళూరునుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు. రెండు టీ 20 మ్యాచ్‌లలో మొదటి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 8న విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. విశాఖలో జరుగుతున్నా మొదటి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌ ఇది. రెండు జట్ల ఆటగాళ్లు గురు, శక్రవారాల్లో నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.