విశాఖ డెయిరీ పాల ధర పెంపు

శ్రీకాకుళం, జూలై 16: విశాఖ డెయిరీ పాల ధరలు పెరిగాయి. ప్రస్తుతం రూ. 16కు లభ్యమయ్యే అర లీటరు పాకెట్టు ధర రూ. 17కు, రూ. 32కు లభ్యమయ్యే లీటరు పాకెట్టు ధర రూ. 34కు పెరిగాయని శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఉన్న పెద్దపాడు పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్‌ సీహెచ్‌ సోమినాయుడు తెలిపారు. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమలులోకి తీసుకు వచ్చారు. అయితే రూ.7కు లభ్యమయ్యే 200మిల్లీ లీటర్ల పాలపాకెట్టు ధరను మాత్రం పెంచలేదు. విద్యుత్తు కోత, ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ధర పెంచామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.