విశ్వవిద్యాలయంలో తెలంగాణా ఉద్యాగులకు అన్యాయం: కోదండరాం

హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్వవసాయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణా విశ్వవిద్యాలయంగా మార్చాలని తెలంగాణ రాజకీయ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. అవసరం అయితే రాయలసీమ, ఆధ్ర ప్రాంతాల్లో వేర్వేరుగా వ్వవసాయ విశ్వ విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో వ్వవసాయ విశ్వవిద్యాలయ ఉద్యోగుల ఐకాస ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. ఇప్పటివరకు ఈ విశ్వవిద్యాలయంలో వీసీ నియామకం నుంచి ఉద్యోగుల నియామకాలన్నిటిలో తెలంగాణ ఆద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ దఫా వీసీగా తెలంగాణ ప్రాంత వ్యక్తినే నియమించాలని డిమాండ్‌ చేశారు.