విషజ్వరాలతో ముగ్గురు మృతి

వరంగల్‌: జిల్లాలో విషజ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు. పరకాల మండలం లక్ష్మీపురంలో విషజ్వరానికి గురై వరంగల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…పల్లెబోయిన శ్రీలత, దానం పుల్లయ్య, ఓదెలు అనే వ్యక్తులు మృత్యువాతపడారు. వీరు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్షం.