వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భాదావత్ రాజు
కొత్తగూడ ఆగస్టు 31 జనంసాక్షి:కొత్తగూడ మండలం లోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న 38వ రోజున నిరవధిక సమ్మెలో భాగంగా మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బాదావత్ రాజు పూర్తి మద్దతును తెలిపారు.అనంతరం మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో వీఆర్ఏ మండల అధ్యక్షుడు చెన్నూరి రవి,ఉపాధ్యక్షులు నరసయ్య,ప్రధాన కార్యదర్శి సాంబయ్య,కోశాధికారి సురేష్,రవీందర్,సత్యం,చంద్రయ్య, సమ్మక్క,కళావతి,సుశీల,సమ్మక్క, శ్రీలత,రాధాకృష్ణ,క్రాంతి,శ్రీ రంగం,మహేష్,సునీల్,శ్రీకాంత్ పాల్గొన్నారు.