వీణవంకలో సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు.

వీణవంక 9(జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు యు పి ఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేయడం జరిగింది
అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతల శ్యాంసుందర్ రెడ్డి. సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి లు మాట్లాడతూ….డిసెంబర్ 9 వ తేది న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన జారీ చేసిన దానికి అనుగుణంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర నికి తల్లి లాగా రాష్ట్ర ప్రజలు కొలుస్తున్నారు
తెలంగాణ రాష్ట్రము లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి ఈరోజు మహాలక్ష్మి, చేయూత పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదిన రోజున ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషకరం మిగతా గ్యారంటీలు కూడా 100 రోజుల లో పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యామ్ సుందర్ రెడ్డి . రాష్ట్ర సీనియర్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి.గంగాడి రాజిరెడ్డి. నల్ల కొండల్ రెడ్డి. ఎండి రషీద్. మాదాసి సునీల్. మేక వీరయ్య.ఎండి రజాక్. నల్ల కొండల్ రెడ్డి. జైపాల్ రెడ్డి. రామ్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాలుగోన్నారు