వేసవి రద్దీ దృష్ట్యా 370 ప్రత్యేక రైళ్లు:జీఎం శ్రీవాత్సవ..
హైదరాబాద్: వేసవి రద్దీ దృష్ట్యా 370 ప్రత్యేక రైళ్లు నడపడంతోపాటు ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే జీఎం శ్రీవాత్సవ తెలిపారు. దక్షిణమధ్య రైల్వే 60వ వారోత్సవాల సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు కోట్ల రూపాయలతో పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.