వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి
ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏళ్ల బాల్రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఒకే ఒక్క సంతకంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ . రైతులకు ఇచ్చిన కరెంటు. ఆరోగ్యశ్రీ .108 అంబులెన్స్ . ఫీజు రియంబర్స్మెంట్ అలాంటి ఎన్నో పథకాలతో బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మరణం లేని మహా నేత అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండం రాజి రెడ్డి నామపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మాదాసు అనిల్ బదులు గ్రామ శాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి వెలుముల రాంరెడ్డి వేముల సత్యం గౌడ్ ముద్దం రాజు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజానీ నరేష్ పట్టణ అధ్యక్షులు తాళ్ళ విజయ్ రెడ్డి ఎన్ ఐ సి యు మండల అధ్యక్షులు సారుగు రాకేష్ సద్ది మధు మచ్చ కొండయ్య మద్దికుంట రాజాం తదితరులు పాల్గొన్నారు