వ్యక్తికి కత్తిపోట్లు
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా రథాలపేటలో దుండగులు ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ప్రత్తిపాడు మండలం వొమ్మంగికి చెందిన గోపిగా గుర్తించారు. దాడికి కారకులు, కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.