వ్యాపారి అరెస్ట్‌

జ్యోతినగర్‌, మే 26, (జనం సాక్షి):
దొంగిలించిన సరుకును కొనుగోలు చేసిన నేరంపై గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన దొంతుల శ్రీనివాస్‌ను శనివారం ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎల్కలపల్లి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగిలించిన నలుగురు నేరస్తులు అందులోని రాగి తీగను వెలికితీసి, స్క్రాప్‌ దుకాణంలో అమ్మారు. ఈ స్క్రాప్‌ దుకాణం నిర్వాహకులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.