శంషాబాద్ నుంచి విమాన రాకపోకల పునరుద్దరణ
హైదరాబాద్ ::శంషాబాద్ విమానాశ్రయంలో పొగమంచు తీవ్రత తగ్గుతోంది. పొగమంచు కారణంగా నిలిపివేసిన పలు విమాన సర్వీపులను పునరుద్దరించినట్లు అధికారులు తెలిపారు. రన్‌వేపై ఈతెల్లవారుజామున దట్టమైన పొడమంచు కమ్మ కోవడంతో దుబాయ్. మస్కట్ , చెన్నై. ముంబయి నుంచి రావాల్సిన ఐదు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. అలాగే ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన సర్వీసులు కూడా టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్నాయి. పొగమంచు తీవ్రత తగ్గడంతో రాకపోకలను పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.



