శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం.శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
కోటగిరి ఫిబ్రవరి 27 జనం సాక్షి:-పోతంగల్ సహకార సంఘం పరిదిలోని సోంపూర్ గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి,డైరెక్టర్ పవర్ శివాజీ ఆధ్వర్యంలో శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.సహ కార సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియో గం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకురి గంగాధర్,సిందే మాణిక్ రావు,సంజు పటేల్,రైతులు పాల్గొన్నారు.