శాసనసభ్యులు సభావిలువలు పాటించాలి : సభాపతి

హైదరాబాద్‌: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వివిధ రాపాల్లో తన దృష్టికి వచ్చాయని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు, ఈ మెయిల్స్‌ ద్వారా పూర్తి సమాచారం అందించారని ఆయన శుక్రవారం శాసనసభ ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడారు. ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేస్తే సభా నియమావళి కమిటీ స్పందిస్తుందన్నారు. ప్రతి సభ్యుడూ… సభా విలువలు పాటించాలని, హుందాగా వ్యవహరించాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. మహిళా శాసనసభ్యురాలు పరిటాల సునీత ఇంట్లో పోలీసుల  సోదాలపై స్పందిస్తూ సునీత ఎంతో ఆవేదనతో ఫిర్యాదు చేశారని, 48 గంటల్లోగా సంబంధిత అధికారుల నుంచి సమాచారం తెప్పించుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు.

తాజావార్తలు