శాసన సభ రెండోసారి వాయిదా

హైదరాబాద్‌: శాసన సభ వర్షాకాల చివరి రోజు సమావేశాలు తెరాస సభ్యుల ఇందోళన మధ్య రెండోసారి వాయిదా పడ్డాయి. ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభంకాగానే తెలంగాణపై తీర్మానాం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస నేతలు స్పీకర్‌ పోడియం వద్దకు చేరారు. తెలంగాణ కోరుతూ ప్లకారులు ప్రదర్శించారు. దీంతో స్పీకర్‌ ప్రశ్నోతరాలను  రద్దు చేసి విద్యుత్‌ సమస్యలపై చర్చిద్దామని వారికి సూచించారు. అయితే సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్‌ సభను గంటపాటు వాయిదా వేశారు.