శ్రీకూర్మనాథున్ని దర్శించుకున్న డీజీపీ

గార, శ్రీకాకుళం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మనాథస్వామి ఆలయాన్ని డీజీపీ దినేష్‌రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళంలో నూతనంగా నిర్మించిన పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎంతో పాటు డీజీపీ పాల్గొన్నారు.