శ్రీలంక విజయలక్ష్యం 130

క్వాండీ: పల్లేకల ఇంటర్నేషన్‌ స్టేడియంలో టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-1 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా శామ్యూల్స్‌ 50, బ్రేవో 40 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అత్యధికంగా బీఏడబ్య్లూ మెండీస్‌ 2 వికెట్లు తీసుకున్నారు.