శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం 65 లక్షలు

సింహాచలం: శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి హుడీ ఆదాయం 65లక్షల నలభైఏడు వేల రూపాయలు వచ్చినట్లు ఇన్‌ఛార్జి ఈవో భ్రమరాంబ చెప్పారు. సోవమారం దేవాలయంలో సిబ్బంది హుండీ లెక్కింపు చేపట్లారు. నగదుతో పాటు 75 గ్రాముల బంగారం, 5 కిలోల 700 గ్రాముల వెండి లభించినట్లు చెప్పారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఈ మొత్తం ఆదాయం 31 రోజులదిగా ఆమె పేర్కొన్నారు.