సంగీత ప్రపంచ రారాజు మైఖేల్‌ జాక్సన్‌కు ఘనంగా నివాళులు

హైదరాబాద్‌: పావ్‌ సంగీత ప్రపంచ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ జన్మదిన ఉత్సవాలను హైదరాబాద్‌ యువత ఘనంగా నిర్విహించారు. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ సత్యం, కలర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అకాడెమీ సంయుక్తంగా నగరంలోని సిటీ సెంట్రల్‌ మాలలో ఈ వేడుకలు నిర్వహించారు. త్వరలో మైఖేల్‌ జాక్సన్‌ పేరుతో లక్షమందితో నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు అకాడెమీ నిర్వాహకులు తెలిపారు.