సచివాలయం ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్‌ చేస్తూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. మంత్రుల నివాస ప్రాంగణ ఘటనతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు. అయినప్పటికి కొందరు విద్యార్థులు ప్రధానగేటు వరకు రావడంతో వారిని అరెస్టు చేశారు.