సడక్‌బంద్‌ను అనుమతించని జిల్లా ఎస్పీ

మహబూబ్‌నగర్‌ : ఈ నెల 21న ఐకాస నిర్వహిస్తున్న సడక్‌బంద్‌కు అనుమతి లేదని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 22 ఉదయం వరకూ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. సడక్‌బంద్‌కు వచ్చే నేతలను అరెస్టు చేస్తామని. ఇప్పటికే పలువురి ఆందోళనకారులను బైండోవర్‌ చేశామని ఆయన హెచ్చరించారు.