సత్యాగ్రహ దీక్షలో బచ్చన్నపేట కాంగ్రెస్ నాయకులు


బచ్చన్నపేట (జనం సాక్షి):రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుండి రద్దు చేయడానికి నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో చేపట్టినటువంటి సత్యాగ్రహ దీక్షలో మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు బచ్చన్నపేట కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగిందని . స్టేట్ కిసాన్ కోఆర్డినేటర్ నిలిగొండ శ్రీనివాస్ తెలిపారు. పొద్దున 10:00 నుండి. సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన ఈ దీక్షలో.
బిసి సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి శ్రీనివాస్ మరియు బచ్చన్నపెట్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేణు వందన, మహిళ పట్టణ అధ్యక్షురాలుమరియు నియోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ శ్రీ జంగిటి నరేష్ బచ్చన్నపెట్ మండల సెక్రెటరీ బందరం రాజు. బచ్చన్నపేట టౌన్ మహిళా అధ్యక్షురాలు నీల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు