సన్నాలకు వెంటనే మద్దతు ప్రకటించాలి: కాంగ్రెస్‌

share on facebook

పెద్దపల్లి,నవంబర్‌13(జ‌నంసాక్షి): కేసీఆర్‌ ఆదేవాల మేరకు సన్నాలు పండించినందున సన్నాలకు మద్దతు ధరలు నిర్ణయించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆ పార్టీ పేర్కొంది. తక్షణం మద్దతు ధరలు ప్రకటించా ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అన్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. గిట్టుబాటయ్యే పంటలు వేసేలా రైతులను సన్నరకం పండించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. దోమపోటు, అతివర్షాలకు కేవలం 5నుంచి 10 క్వింటాళ్ళ వరి ధాన్యమే చేతికందిందన్నారు. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాల్లేవని వివరించారు. రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. క్వింటాల్‌ వరి కి 2500 రూపాయలు చెల్లించి పంట నష్టహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. లేని యేడల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేప డుతామని హెచ్చరించారు.

Other News

Comments are closed.