సబితా ఇంద్రారెడ్డిని కలిసిన స్వామీజీలు

హైదరాబాద్‌: కమాలానంద భారతిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కొందరు స్వాములు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోపక్క కమలానంద భారతి స్వామిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు స్వాములు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. గవర్నర్‌ను కలిసిందుకు అనుమతి అభించే వరకు దీక్ష కొనసాగిస్తామని స్వామీజీలు తెలిపారు.