సభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన

హైదరాబాద్‌: శాసన సభ సమావేశాలు గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తెరాస ఎమ్మెల్యేల నిరసన సభలో కొనసాగింది. స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన సభ్యులు తెలంగాణపై తీర్మానం చేయాలని తమ డిమాండ్‌ను కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి విద్యుత్‌ సమస్యలపై చర్చిద్దామని స్పీకర్‌ సభ్యులకు సూచించారు. అయితే సభ్యులు తమపట్టును వీడక నిరసన కొనసాగిస్తున్నారు.