సమయాన్ని వృధా చేయవద్దు

 

 

 

వ్యక్తిత్వ వికాస నిపుణులు గాలి నరేందర్
జుక్కల్, మార్చి 07, (జనం సాక్షి),
అతిముఖ్యమైన పరీక్షల సమయంలో సమయాన్ని వృదాచేయవద్దని వ్యక్తిత్వ వికాస నిపుణలు,మోటివేటర్, వక్త గాలి నరేందర్ అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలములోని పెద్ద ఎక్లారా సాంఘీక గురుకుల పాఠశాల, కళాశాల లో ఏయస్ఆర్ పౌండేశన్ అధ్వర్యంలో నిర్వహించిన విజయస్పూర్తి కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్ధులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న వేళ ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. ఆనందంగా ఉత్సాహంగా చదువాలన్నారు. చదివింది ఎక్కువ కాలం గుర్తుండేలా మెలకువలను వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సవిత,ఏయస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అయ్యల సంతోష్,టీచర్స్ శీతల,షాహీధ,మౌనిక,మీనా,రాచప్ప,సాయిలు,,ఫౌండేషన్ నాయకులు రాథోడ్ జీవన్,సాయిలు, విద్యార్థులు పాల్గొన్నారు.