సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

కాకినాడ, జూన్‌ 12 (ఎపిఇఎంఎస్‌): రామచంద్రాపురం ఉప ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని 15 గ్రామాలలో 31 పోలింగ్‌ కేంద్రాలను అతి సమస్యాత్మక కేంద్రాలుగా, 19 గ్రామాలలోని 48 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా, 12 గ్రామాలలో 17 కేంద్రాలలో కొద్దిపేట సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తూరు, చాకలిపేట, రాజకోట, రామచంద్రాపురం మండలం పరిధిలోని తోటపేట, బీమక్రోసుపాలెం, తాళ్లకొలం, కాకవరం, కె. గంగవరం మండలంలో కోళ్ల, కత్తివాడ, కోటిపల్లి, కె. గంగవరం, కాజులూరు మండలంలో పల్లిపాలెం, కూలంక,  తిమ్మరాజుపాలెం, కాజులూరు గ్రామాలను అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు.