సమావేశానికి పాక్‌ అంగీకారం

శ్రీనగర్‌ : ఎట్టకేలకు భారత్‌ సైన్యాధికారులతో సమావేశానికి పాకిస్థాన్‌ అంగీకరించింది. జమ్మూకాశ్మర్‌లోని పూంఛ్‌ జిల్లాలో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇరుదేశాల బ్రిగేడియర్లు సమావేశం కానున్నారు. ఇటీవల పాక్‌ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ ప్రతిపాదన తెచ్చింది.