సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెంది .. మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం

పరకాలలో టీఆర్‌ఎస్‌నే గెలిపించండి

పరకాలలో టీఆర్‌ఎస్‌నే గెలిపించండి
మరణ వాంగ్మూలంలో చివరి కోరిక
ోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెందిన మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం చేసుకు న్నాడు. గోదావరిఖనికి చెందిన పర్స రాజేశ్‌ అనే యువకుడు శనివారం హెయిర్‌ డై తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పరకాల నడి బొడ్డులో జరగడం కలకలం రేపింది. గోదా వరిఖనిలో ఓ స్కూల్‌ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేశ్‌ పరకాల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.భిక్షపతి తరఫునఎంజీఎం ఆస్పత్రిలో చేర్పిం చారు. మెరుగైన వైద్య సేవలందించాల్సిందిగా ఎమ్మెల్యే ఆస్పత్రి ఉన్నతాధికారులను కోరారు. రాజేశ్‌ పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకు న్నారు. రాజేశ్‌ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన విషయాన్ని స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు చెప్పడమే కాకుండా వారిని ఉన్నఫళంగా గోదావరిఖని నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. టీిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీమాంధ్ర పార్టీల నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా సురేఖ, జంగారెడ్డి తదితరులు తీవ్రంగా విమర్శించడాన్ని తట్టుకోలేక ఈ సంఘటనకు పాల్పడినట్లు రాజేశ్‌ పేర్కొన్నాడు. రాజేశ్‌ వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. కాగా,  స్థానిక ఓ స్కూల్‌ బస్‌డ్రైవర్‌గా పని చేస్తున్న  రాజేష్‌ వారం రోజుల కిందట ఒంటరిగానే  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతి గెలుపు కోసం ప్రచారం నిర్వహించడానికి పరకాలకు వచ్చాడు.వారం రోజులుగా రాజేశ్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. అయితే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై సీమాంధ్ర పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది తెలంగాణ నాయకులు అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం వల్లనే రాజేశ్‌ తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాజేశ్‌ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యవర్గాలు తెలిపాయి.