సరబ్‌జీత్‌సింగ్‌ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు

ఇస్లామాబాద్‌ : పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జీత్‌సింగ్‌కు అధ్యక్షుడు జర్దారీ క్షమాభిక్షను ప్రసాదించారు. అతని మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.గత 22 ఏళ్లుగా పాక్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న భారత్‌కు చెందిన సరబ్‌ జీత్‌ విడుదల కోసం న్యాయశాఖ అధికారులు హోంశాఖకు ప్రతిపాదనలు పంపారు. 1990లో ముల్తాన్‌, లాహోర్‌లో జరిగిన బాంబు దాడుల్లో సరబ్‌జీత్‌ ప్రమేయం ఉన్నట్లు నిర్థారించిన కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.