సర్వం సిద్ధం…రేపే పరీక్షసర్వం సిద్ధం…రేపే పరీక్ష -అడిషనల్ కలెక్టర్ సంధ్య రాణి

హన్మకొండ బ్యూరో 3 మర్చి జనంసాక్షి
టీ.ఎస్.పి.ఎస్.సి ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు…కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 05.03.2023 రోజున జరిగే టీ ఎస్ పి ఎస్ సి ఇంజనీరింగ్ విభాగం కు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్, ఎం పి ఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అను పోస్టులకు సంబంధించిన పరీక్ష కు ముందస్తు చర్య నిమిత్తం జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్య రాణీ DRO వాసుచంద్ర లు సంభందిత  విద్యా సంస్థల యాజమాన్యం, కళాశాలల ప్రిన్సిపల్స్, రెవెన్యూ, రవాణా, వైద్య,విద్యుత్,పోలీస్,మున్సిపల్  మరియు ఇతర శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.     ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ… ఈ నెల తేది 05.03.2023 రోజున TSPSC ఆధ్వర్యంలో జరిగే ఇంజనీరింగ్ విభాగం కు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్, ఎం పి ఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, మరియు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అను పోస్టులకు సంబంధించిన పరీక్ష కు  మన జిల్లాలో మొత్తం 05 రూట్స్ లలో 14 సెంటర్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 8,245 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారని  తెలిపారు. ఇందుకు అవసరమైన లైజన్ ఆఫీసర్స్,అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, తదితర అధికారులను, సిబ్బందిని  ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి సెంటర్ కి కావలసిన నీరు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనైనదన్నారు. మరియు ఆర్టీసీ నుండి బస్సు సౌకర్యం కూడా కల్గియుంటుందన్నారు. DMHO నుండి ప్రతి సెంటర్ లో మెడికల్ క్యాంపు కుడా నిర్వహించడం జరుగుతుందన్నారు.     ఇట్టి  పరీక్ష  రెండు సెషన్ లలో వుంటుందని, మొదట ఉదయం: 10.00 am నుండి 12:30 pm వరకు (పేపర్ -l, జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్), రెండవది మధ్యాహ్నం 2.30 pm నుండి 5.00 pm వరకు(సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) నిర్వహించ బడుతుందన్నారు. పరీక్ష వ్రాయు అభ్యర్ధులను  ఉదయం 9.45 ని.లు మరియు మధ్యాహ్నం 2.15 ని. లకు గేట్ ను మూసి వేయడం జరుగుతుందన్నారు. కావున సెంటర్ లోకి అభ్యర్ధులను  ముందుగానే వచ్చి యుండలన్నారు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ లో అభ్యర్థి ఫోటో లేనట్లయితే, ముందస్తుగా 1. హాల్ టికెట్ పై, 2.నామినల్ రోల్స్ మీద, 3. డిక్లేరేషన్ మీద మొత్తం 3 ఫోటోలను అంటించి గెజిటెడ్ అధికారి చే సంతకం చేయించుకోవాలి. మరియు ముఖ్యంగా  ప్రతి అభ్యర్థిని గేటు వద్ద క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్ష హాల్లోకి మాత్రమే ప్రవేశించడానికి అనుమతించాలని అధికారులకు సూచించారు. TSPSC నుండి డౌన్‌లోడ్ చేయబడిన అడ్మిట్ కార్డ్ ప్రింట్‌అవుట్ మరియు అసలైన గుర్తింపు రుజువుతో.  అభ్యర్థులు కాలిక్యులేటర్లు, గణిత పట్టికలు, లాగ్ బుక్‌లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్‌లు, వాలెట్, హ్యాండ్ బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్‌లు, చార్టులు, మొదలగు వాటిని తీసుకురాకూడదని ముందస్తు తెలియజేయాలనీ అన్నారు. సెంటర్ తెలియని అభ్యర్థులు తమకు సంబందించిన సెంటర్ కి ముందు రోజు వెళ్లి చూసుకోవడం మంచిదన్నారు.మరియు ముఖ్యంగా OMR షీట్ పైన అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్,పేపర్ సీరీస్ లు చాలా జాగ్రత్తగా చూసి బబ్లింగ్ చేయాలన్నారు లేనిచో ఇన్-వాలిడ్  అవుతుంది అన్నారు.     ఈ కార్యక్రమంలో DMHO సాంబశివ రావు, DMWO శ్రీనివాస్, సర్వే లాండ్ రికార్డ్ AD ప్రభాకర్, కలెక్టరేట్ సుపెరిండెంట్ విజయ లక్ష్మి,  TSPSC ప్రతి నిధులు B. సురేష్ S.O, N. సతీష్ A.S.O, D. విఘ్నేష్ A.S.O, మరియు విద్యా శాఖ యాజమాన్యం, కళాశాలల ప్రిన్సిపల్స్, రెవెన్యూ, రవాణా,పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.