సాక్షిపై సీబీఐ దాడులు..పత్రికా స్వేచ్ఛకకు విఘాతమే రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

హుస్నాబాద్‌,మే26(జనంసాక్షి) :
వైఎస్‌ జగన్‌ పై ఉన్న కోపాన్ని పత్రిక పై చూపిస్తూ సీబీఐ చేత దాడులు చేయిస్తున్న ప్రభుత్వానిది పత్రికా స్వేఛ్చకు విఘాతం కలిగించే చర్య అని పలువురు వక్తలు అన్నారు. శనివారం సాక్షి ఆధ్వర్యంలో స్థానిక సంఘమిత్ర జూనియర ‌కళాశాలలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిం చారు. ఇందులో పలువురు వక్తలు మాట్లాడుతు ఒక వైపు విచారణ కోనసాగుతుం డగా మరో వైపు ప్రభుత్వం సాక్షికి ప్రకటనలు ఆపడం భావ్యం కాదన్నారు.ఆరోపణలు కాకుండా ఆధారాలు చూ పించి దోషిని శిక్షించాలని వారు సూచించారు. వేలాదిగా సాక్షి పత్రికపై ఆధారపడిన ఉద్యోగులు, విలేకరులు, సిబ్బంది నిరాధారులయ్యే అవకాశ ముందని కావున ప్రభుత్వం, సీబీఐ ఈ విషయం పట్ల పునరాలోచన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌అధాలత్‌ సభ్యులు డీవీఆర్‌ నర్సయ్య, మాజీ సర్పంచ్‌ కేడంవ లింగమూర్తి, కవులు శ్రీధాస్యం లక్ష్మయ్య, వడ్డెపల్లి మల్లేశం, న్యాయ వాదులు కర్ర ఎల్లారెడ్డి, కన్నోజు రామకృష్ణ్ణ, లింగంపల్లి మల్లారెడ్డి, వివిధ పార్టీల నాయకులు అయిలేని మల్లిఖార్జున్‌రెడ్డి, ఎండీ హస్సన్‌, కవ్వవేణుగోపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, భత్తుల చంద్ర మౌళి, రవి, స్పూర్తి పందిల్ల శంకర్‌, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సావుల మల్లేశం, బూట్లరాజమల్లయ్య, గంగిశెట్టి మహేం దర్‌, తెరాస మహిళా నాయకురాలు బొద్దుల కనుకలక్ష్మి , విలేకరులు కొత్తపల్లి రామకృష్ణ, చలా ్లరాజు, దుండ్ర ఎల్లయ్య, వరికోలు కళాచందర్‌, వరప్రసాద్‌, సావుల శ్రీను, పెద్ది రవిందర్‌, ముక్కెర సంపత్‌ తదితరులున్నారు.