సాగర హారానికి ప్రభుత్వం అనుమతిచ్చిన నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాన్ని పరిశీలించిన ఐకాస నేతలు

హైదరాబాద్‌: కవాతుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తిరిగి అణచివేత చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఆరోపించారు. సాగర హారానికి ప్రభుత్వం అనుమతిచ్చిన నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాన్ని ఐకాస నేతలు, శాసనసభ్యులు పరిశీలించారు. ఇంకా అరెస్టులు జరుగుతున్నాయని వెంటనే వారందరినీ విడుదల చేయడంతో పాటు కవ్వింపు చర్యలను మానుకోవాలని శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. కవాతును విఫలం చేసి తెలంగాణ వాదం లేదనిపించే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.