సావిత్రీబాయి పూలేకు నివాళి
వేములవాడ రూరల్ మార్చి 10 (జనం సాక్షి) :
స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం వేములవాడలో TPTFఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక చైతన్యం కోసం సావిత్రీబాయి చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు. మహిళా జనోద్ధరణకు వారి సేవలను కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం పాటుపడాలన్నారు. సంఘ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు వికృతి అంజయ్య గారు, వేములవాడ అర్బన్ రూరల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పార్వతి తిరుపతి, బొజ్జ కృష్ణ, CH.రామచంద్రo , పొన్నం.శ్రీనివాస్ కార్యకర్తలు D. చక్రపాణి, దూస సంతోష్, S. శ్రీనివాస్, N.శ్రీనివాస్ PET తదితరులున్నారు.