సింగనేణి గనిలోకార్మికుడి ఆత్మహత్య

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా సింగనేణి జీడీకే 11వ గనిలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిట్టారపు వీరయ్య (50) అనే కార్మికుడు ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రెండో షిప్టు విధులకు వెళ్లిన వీరయ్య రాత్రి తిరిగిరాకపోవడంతో అతని కోసం సిబ్బంది గనిలో గాలింపు చేపట్టారు. గనిలో పనిచేస్తున్నచోటే ఉరివేసుకోని వీరయ్య మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. కార్మికుడి మృతికి గల కారణాలు తెలియలేదు.