‘సింగాపురం రాజన్న’కు పలువురి నివాళులు

సింగాపురం, జూలై 12(జనంసాక్షి): మాజీ పార్లమెంట్‌ సభ్యులు వడితెల రాజేశ్వర్‌రావు ప్రథమ వర్దంతి సందర్భంగా హుజురాబాద్‌ మండలంలోని సింగాపురం గ్రామంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళా శాల క్యాపంస్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయి ఆయనకు నివాళులు అర్పిం చారు. మాజీ పార్లమెంట్‌ సభ్యులు సింగాపురం రాజన్నగా ప్రజలు పిలుచుకొనే రాజేశ్వర్‌ రావు ప్రథమ వర్దంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరయి ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్‌, పార్లమెంట్‌ సభ్యులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రా వు, రాజయ్య, కొప్పుల ఈశ్వర్‌, హరీశ్వర్‌రెడ్డి, అరవింద్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు వినోద్‌కుమార్‌లు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పిం చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆయ న మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి అని, తెలంగాణ సాధనతోనే ఆయన ఆత్మకు తృప్తి అన్నారు.