సిగ్నలింగ్‌ వ్యవస్థ ధ్వంసం: పలు రైళ్లు రద్దు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతులో  ఆందోళన కారులు హుస్సేన్‌సాగర్‌ జంక్షన్‌ వద్ద  రైల్వే క్యాబిన్‌ను ధ్వంసం చేయటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది, క్యాబిన్‌ ధ్వంసం కారణంగా సిగ్నలింగ్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినటంతో రైళ్లను రద్దు చేస్తున్నాట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. చైన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, సీఎన్‌టీ ముంబై- హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, పూణె- హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి- హైదరాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ పట్నం – హైదరాబాద్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌, నర్సాపూర్‌- హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఈ రోజు రద్దు చేస్తున్నట్లుతెలియజేశారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు కొల్హాపూర్‌లో బయలుదేరే సీఎన్‌ఎంటీ కొల్హాపూర్‌- హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. సిగ్నలింగ్‌ వ్యవస్థను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.