సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ..
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 18 (జనంసాక్షి)
 ఈనెల 21, 22, 23 తేదీలలో సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పిలుపునిచ్చారు. సిద్దిపేటలో జరగనున్న మహాసభల  పోస్టర్  విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ , జీ పి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి పాండు,  మాట్లాడుతూ సిఐటియు కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘంగా ఎదిగిందని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు, వీఆర్ఏలు ఇతర అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల కోసం, కనీస వేతనాలు అమలు చేయాలని అనేక పోరాటం నిర్వహిస్తుందని చెప్పారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు చేస్తున్న సీఐటీయూ యూనియన్ బలో పేతంగా ఉంటేనే మంచిదని అన్నారు. అందుకు అనుగుణంగా కార్మిక రంగం కృషి చేయాలని కోరారు. కార్మికుల ఉద్యమాల సారథి సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు. మహాసభల చివరిరోజు 23న కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ కు అధిక సంఖ్యలో హాజరై కార్మికుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర నాయకురాలు జోగు మాధవి, మండల కార్యదర్శి భాస్కర్, భవన నిర్మాణ సంగం నాయకులు జోగు శేఖర్, సీఐటీయూ నాయకులు, అర్జున్, యాదయ్య, కార్మికులు పాల్గొన్నారు