సిరియాలో టీవి కేంద్రం పై దాడి ఏడుగురి మృతి

డమాస్కన్‌: సిరియాలోని అల్‌-ఇక్‌బరియా టీవీకేంద్రం పై దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు సిబ్బంది మరణించారు. అనంతరం కొందరు సిబ్బందిని దుండగులు తమతో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అల్‌-ఇక్‌బారియా టీవీ అధ్యక్షుడు బసర్‌ అస్సాద్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తోందని దీంతో ప్రభుత్వ వ్యతిరేకులే ఈ దాడులకు పాల్పడివుంటారని సంస్థలు అనుమానిస్తున్నాయి.