సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల రాస్తారోకో

విజయనగరం, జూన్‌ 24 : మెరుగైన వేతన భత్యాల కోసం, పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం వల్ల కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు టీవీ రమణ, రెడ్డి శంకర్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పలు మార్లు ఆందోళన చేసినప్పటికీ అధికారులు స్పందించడంలేదని వారు విమర్శించారు.