సీతంపేట గ్రామంలో చోరి

ముత్తారం జూలై 05 (జనంసాక్షి)
మండలంలోని సీతంపేట గ్రామంలో గురువారం మధ్యాహ్న సమయంలో చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే నూనెటి పద్మ-రాజయ్యకు చెందిన ఇంటిలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగోట్టి దొంగతానికి పాల్పడ్డారు. భాదితులు పోలం పనులకు వెళ్లి తిరిగి వచ్చే సరికి తాళం పగల కోట్టి బిరు వాలో ఉన్న వస్తువులు చిందర వందరగా ఉండడంతో ఇంట్లో ఉన్న వస్తువులను పరిశీలించగా రెండు న్నార తూలాల బంగారం, రూ. 5 వేలు నగదు చోరికి గురైనట్లు పోలీసులకు అందించారు. ఓదులు చెందిన ఇంటికి తాలం పగల గోట్టెందుకు దుండగులు ప్రయాత్నించి విఫలమయ్యారు. ఈ విషయం తెలసుకున్న ఎస్సై ప్రదీప్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివారలను అడిగి సేకరించారు. దొంగతానికి పాల్పడిన వ్యక్తుల గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.