సీమాంధ్ర వలస పాలకుల్లారా

క్విట్‌ తెలంగాణ
గన్‌ పార్కువద్ద ధర్నా
ఆగస్టు 1 నుంచి ఎనిమిది వరకు ధర్నాలు, ర్యాలీలు
తెలంగాణ ప్రజాఫ్రంట్‌ పిలుపు
హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి): హైదరాబాద్‌ సీీమాంధ్ర పాలకులు తెలంగాణను విడిచి వెళ్లలని క్విట్‌ తెలంగాణ పేరుతో ఆగస్ట్టు 1నుంచి 8వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చింది. ఈ మేరకు డిమాండ్‌ చేస్తు గన్‌ పార్కు వద్ద తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ తెలంగాణ అమన వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ వనరుల దోపిడిలో సీమాంధ్ర పాలకులదే ప్రాధాన పాత్ర అని తెలంగాణ ప్రజల తఅభిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణలో సీమాంధ్రుల నేతల పాలన సాగ డానికి వీల్లేదన్నారు. ఆగస్టు మొదటి వారంలో జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపు నిచ్చారు. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు జరిగే వరకు తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నిర్విరామంగా ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వేదకుమార్‌, రాజనర్సింహ, లక్ష్మీ పలు ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.