సీ.పీ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలి.

సీ.పీ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలి.
ఎస్పీ అఖిల్ మహాజన్ .రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 28. (జనంసాక్షి).గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు లేదా ఊపిరితుత్తులు శ్యాస తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ప్రాణ రక్షణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన సీపీఆర్ పై ప్రతి పోలీస్ అధికారికి అవగాహన కలివుండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.మంగళవారంజిల్లాలోనిఅధికారులకు,సిబ్బందికి పద్మనాయక ఫంక్షన్ హల్ లో ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందికి,సివిల్ సిబ్బందికి,హోమ్ గార్డ్స్ సిబ్బందికి సీపీఆర్ ఎలా చేయాలనే అంశాలపై ప్రముఖ వైద్య నిపుణులు వివరించారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూఆకస్మిక గుండెపోట్ల నుండి ప్రజలను రక్షించేందుకు అన్నిస్థాయిలకు చెందిన పోలీస్ అధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు.నిత్యం ప్రజల మధ్యఉండే పోలీసులకు ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన వ్యక్తులు తారసపడే అవకాశం ఉన్నదందున,అన్నిస్థాయిలకు చెందిన పోలీసులు పూర్తిస్థాయిలో శిక్షణ  పొందినట్లయితే అలాంటి వ్యక్తుల ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తద్వారా వారి కుటుంబాలకి మేలు చేసివాళ్ళము అవుతామని తెలిపారు.ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన సందర్భాల్లో సిపిఆర్ విధానం ద్వారా గుండెకు రక్తప్రసరణం అందడం,నోటిద్వారా ఆక్సిజన్ అందించడం వల్ల గుండె పనిచేయడం ప్రారంభించి ప్రమాదానికి గురైనవారిని రక్షించవచ్చని తెలిపారు.అలాగే కార్డియాక్ అరెస్టు భారీన పడకుండా వుండాలంటే వ్యక్తిగత అలవాట్లలో మార్పురావాలని, ఆహరపు అలవాట్లకు సంబంధించి నియమ నిబంధనలు పాటించాల్సి వుంటుందని, తప్పనిసరిగా శారీరక వ్యాయామం అవసరమని అన్నారు.అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్టు కారణంగా మరణాల సంఖ్య పెరిగిపోవడంతో దీనిపై స్పందించి సీపీఆర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో శిక్షణ అందజేయడం జరుగుతోందని. కార్డియాక్ అరెస్టు కారణంగా పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ ప్రక్రియ ద్వారా హృదయ శ్యాసకోశ పునరుజ్జీవనం కలిగించవచ్చని, ప్రస్తుత రోజుల్లో సీపీఆర్ ప్రక్రియ పై తప్పనిసరిగా అవగాహన కలిగివుడాలని అన్నారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ అనిల్ కుమార్, ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, వైద్య నిపుణులు ఎస్.ఐ లు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.