సుధాకర్ రెడ్డితో మాకు శత్రుత్వుం లేదు : పరిటాల సునీత
అనంతపురం : కాంగ్రెస్ నాయకుడు సుధాకర్‌రెడ్డి కుటుంబంతో తమకు వ్యక్తిగతంగాను. పార్టీ పరంగానూ ఎలాంటి శత్రుత్వం లేదని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలియజేశారు. హత్య నిందితులను పట్టుకోలేని పోలీసులు తన కుమారుడి అరెస్టుకు తొందరెందుకు పడుతున్నారని సునీత ప్రశ్నించారు. హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులు పట్టుబడితే ముగ్గురి అరెస్టు ఎందుకు చూపడంలేదో పోలీసులు తెలపాలని డిమాండ్ వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యె ఇంట్లో సోదాలు చేసేటప్పుడు మహిళ కానిస్టేబుల్ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.