సుశీల్‌ కుమార్‌ షిండేది విధానపరమైన ప్రకటన కాదు: కోదండరాం

హైదరాబాద్‌: చిన్న రాష్ట్రాలు ఏర్పడితే నక్సల్స్‌ సమస్య పెరిగి పోతుందని తన దృష్టికి వచ్చిందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం స్పందించారు. అది ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలని కొట్టి పారేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ఆయన ప్రకటించలేదని తెలియజేశారు. తెలంగాణపై తీసుకోవాల్సింది రాజకీయపరమైప నిర్ణయమని కోదండరాం తెలిపారు.