సూర్యాపేట కాల్పులు ఇర్ఫాన్ గ్యాంగ్ పనేనా ?

నల్గొండ : సూర్యాపేట హైటెక్ బస్టాండులో పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనలో ఇర్ఫాన్ గ్యాంగ్ హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనిఖీ చేస్తున్న పోలీసులపై దొంగలు కాల్పులు జరిపిన ఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన సీఐ, హోంగార్డుని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే అరెస్టు అయిన ఇర్ఫాన్ నల్గొండ జైల్లో ఉన్నాడు. ఇర్ఫాన్ చూసేందుకు తన్వీర్ గ్యాంగ్ వస్తోందని, ఈ గ్యాంగ్ ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇర్ఫాన్ గ్యాంగ్ ను తప్పించేందుకు తన్వీర్ గ్యాంగ్ వచ్చిందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.