సెప్టెంబనేలోగా పురపాలక ఎన్నికలు:మంత్రి మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి ప్రత్యేక పరిస్దితుల కారణంగానే సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోయామని మంత్రి మహీదర్‌రెడ్డి తెలిపారు.2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.2011 జనాభాలెక్కల ప్రకారం మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లుందుకు తాము సిద్దంగా ఉన్నామని ఇందుకు అనుగుణంగా అనుమతివ్వాలని న్యాయస్థానాన్ని కూడా అశ్రయించనున్నట్లు చెప్పారు.సెప్టెంరులోగా పురపాలక ఎన్నికలు నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు.