సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

హైదరాబాద్‌: సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా నేతలు ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కావడానికి చోటుచేసుకున్న పరిణామాల్ని పాఠ్యాంశంగా తీసుకురావాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ వమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించేందుకు 14 ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నామని ఆ పార్టీ నెతలన్నారు. ప్రతి ఏడాది మాదిరి ఈ సారి కూడా భాజపా ఆధ్వర్యంలో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.