సెప్టెంబర్‌ మార్చ్‌ కొనసాగాల్సిందే : గుత్తా

సంఘీబావం ప్రకటించిన టీఎంపీలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ విజయవంతం చేయాలని గుత్తా సురేంధర్‌రెడ్డి అన్నారు .తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణా మార్చ్‌, డిల్లీ పరిణామాలపై చర్చించేందుకు ఎంపీ వికేక్‌ నివాసంలో సోమవారం రాత్రి భేటీ అయ్యారు. తెలంగాణా మార్చ్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ భేటీలో జానారెడ్డి, కేకే, గుత్తా, పొన్న ప్రభాకార్‌, మధుయాష్కి పాల్గొన్నారు. ఈ అంశంపై మిగతా ఎంపీలతో చిర్చస్తామని, ఉద్యమాన్ని అణచాలని చూస్తే మరింత ఉదృతం చేస్తామని భేటీలో పాల్గొన్న టి.ఎంపీలు తెలిపారు.